ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించండి: హైకోర్టు

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ తనను జైలుకు తరలించడంపై అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సానుకూలంగా స్పందించి తీర్పు వెల్లడించింది. విజయవాడ లేదా గుంటూరుల్లోని ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్న వాదనలు విన్న న్యాయస్థానం ఆయనను గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన […]

Update: 2020-07-08 02:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ తనను జైలుకు తరలించడంపై అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సానుకూలంగా స్పందించి తీర్పు వెల్లడించింది. విజయవాడ లేదా గుంటూరుల్లోని ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్న వాదనలు విన్న న్యాయస్థానం ఆయనను గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వ న్యాయవాది ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ నిర్ణయం తీసుకుంటారని వాదించగా, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను రమేష్ ఆస్పత్రికి తరలింపు ప్రక్రియ చేపట్టారు.

Tags:    

Similar News