ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఆలోచనలో హీరో మోటోకార్ప్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆటో రంగంలోని మార్పులను అనుసరిస్తూ..త్వరలో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కంపెనీ ఇప్పటికీ హై-యుటిలిటీ, మాడ్యులర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను సిద్ధం చేసింది. దీన్ని వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా టూ-వీలర్‌గా కూడా మార్చుకునే వీలుంటుంది. ఈ త్రీ-వీలర్‌ను వ్యక్తిగత, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వినియోగించవచ్చు, ముఖ్యంగా ఈ-కామర్స్ డెలివరీలకు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. సాంప్రాదాయ ద్విచక్ర […]

Update: 2021-01-26 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆటో రంగంలోని మార్పులను అనుసరిస్తూ..త్వరలో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కంపెనీ ఇప్పటికీ హై-యుటిలిటీ, మాడ్యులర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను సిద్ధం చేసింది. దీన్ని వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా టూ-వీలర్‌గా కూడా మార్చుకునే వీలుంటుంది. ఈ త్రీ-వీలర్‌ను వ్యక్తిగత, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వినియోగించవచ్చు, ముఖ్యంగా ఈ-కామర్స్ డెలివరీలకు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

సాంప్రాదాయ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని మించి సరికొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తున్నదని హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ చెప్పారు. ఇప్పటికే 10 కోట్ల వాహనాలను విక్రయించిన నేపథ్యంలో భవిష్యత్తులో మరో 10 కోట్ల వాహనాలను విక్రయిస్తామని, వీటిలో టూ-వీలర్, స్కూటర్, త్రీ-వీలర్ వాహనాలు మాత్రమే ఉండవని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త ఉత్పత్తులను రూపొందించే క్రమంలో కంపెనీ పలు భాగస్వామ్యాలను, ఒప్పందాలను కలిగి ఉండే అవకాశముందన్నారు.

Tags:    

Similar News