ఏపీలో మూడురోజులు వానలేవానలు

దిశ ఏపీ బ్యూరో: ఈ సంవత్సరం ఇప్పటికే కురవాల్సిన వర్షపాతం కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాగల మూడు రోజుల్లో ఏపీలొ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని అమరావతి వాతావణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని వాతావారణ […]

Update: 2020-07-28 05:43 GMT

దిశ ఏపీ బ్యూరో: ఈ సంవత్సరం ఇప్పటికే కురవాల్సిన వర్షపాతం కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాగల మూడు రోజుల్లో ఏపీలొ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని అమరావతి వాతావణ కేంద్రం వెల్లడించింది.

ఈ ఉపరితల ఆవర్తం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని వాతావారణ శాఖ పేర్కొంది. దీంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News