ఏపీలో సెర్చ్ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్

ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు...

Update: 2024-05-27 12:45 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదలకానుండటంతో భద్రతను మరింత పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా మొత్తం జల్లెడ పట్టేస్తున్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 502 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2, 602 వాహనాలను సీజ్ చేశారు. ఏడుగురికి నోటీసులు జారీ చేశారు. ఒక నాటు తుపాకీతో పాటు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ 23 మందిని అరెస్ట్ చేశారు.

ఇక ఫలితాలు విడుదల నేపథ్యంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 8 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతలో భాగంగా ఈ ప్రత్యేక అధికారులను నియమించారు. పల్నాడు జిల్లా, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి వంటి ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు.

Read More...

తెలంగాణలో ఏపీకి చెందిన ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ 

Similar News