కీలక మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండాలి : కెప్టెన్ హర్మన్ ప్రీత్

భవిష్యత్‌లో నిర్వహించే కీలకమైన మ్యాచ్‌లకు తప్పకుండా రిజర్వ్ డేలు ఏర్పాటు చేయాలని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అభిప్రాయపడింది. టీ20 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఇలా చేరుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్.. వర్షం కారణంగా రద్దవడంతో టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలిస్తే మ్యాచ్ జరిగేది. కానీ ఐసీసీ నిబంధనల కారణంగా మా జట్టు ఫైనల్స్‌కు చేరిందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే […]

Update: 2020-03-05 04:58 GMT

భవిష్యత్‌లో నిర్వహించే కీలకమైన మ్యాచ్‌లకు తప్పకుండా రిజర్వ్ డేలు ఏర్పాటు చేయాలని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అభిప్రాయపడింది. టీ20 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఇలా చేరుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్.. వర్షం కారణంగా రద్దవడంతో టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలిస్తే మ్యాచ్ జరిగేది. కానీ ఐసీసీ నిబంధనల కారణంగా మా జట్టు ఫైనల్స్‌కు చేరిందని హర్మన్‌ప్రీత్ తెలిపింది.

ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రపంచ కప్ అందుకోవడం సులభమేనని అన్నారు. టీ20ల్లో ఒత్తిడిని జయించడం కష్టం, అందుకే శుభారంభాన్ని కోరుకుంటానని హర్మన్ వ్యాఖ్యానించారు. కాగా, తనతో పాటు జట్టులో కీలక బ్యాట్స్‌ఉమన్ మంధాన అనుకున్న మేర రాణించలేదని.. ఫైనల్స్‌లో ఫామ్‌ను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

tags : ICC Women’s WT20, Ind vs England, Harmanpreet, Reserve day

Tags:    

Similar News