నేనూ కూలీనే అమ్మ.. ఏసీపీ ఫణీంధర్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొత్తూరులో ఏసీపీ ఫణింధర్, సీఐ సతీష్ బాబులు హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. పక్కనే పత్తిపంట చెనులో మహిళా కూలీలు కలుపు తీస్తున్నారు. దీంతో మొక్కలు నాటిన అనంతరం ఏసీపీ వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పత్తిలో పురుగు బాగా ఉంది అని, పంటకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారా? అంటూ వారితో మాట కలిపి వారితో పాటు ఏసీపీ కూడా కలుపు తీశారు. మీకెందుకు సార్ […]

Update: 2021-08-24 08:32 GMT

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొత్తూరులో ఏసీపీ ఫణింధర్, సీఐ సతీష్ బాబులు హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. పక్కనే పత్తిపంట చెనులో మహిళా కూలీలు కలుపు తీస్తున్నారు. దీంతో మొక్కలు నాటిన అనంతరం ఏసీపీ వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పత్తిలో పురుగు బాగా ఉంది అని, పంటకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారా? అంటూ వారితో మాట కలిపి వారితో పాటు ఏసీపీ కూడా కలుపు తీశారు. మీకెందుకు సార్ ఈ కష్టం.. అని కూలీలు అనగా.. నేనూ కూలీనే అమ్మ. కాకుంటే ప్రభుత్వం నుండి జీతం తీసుకునే నెలవారీ కూలీని అంటూ ఆప్యాయంగా వారితో కలిసిపోయారు. దానితో మహిళలు ఏసీపీ తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News