Minister Harish Rao: మంత్రి హరీశ్ ఆకస్మిక పర్యటన

దిశ సిద్దిపేట: నంగునూరు మండలం జేపీ తండా గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని గురువారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ధాన్యం కొనుగోళ్లు జరపాలని, ప్రతి ఒక్కరూ కరోనాతో జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు, హమాలీలకు సూచించారు. జేపీ తండా గ్రామంలోని ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలో కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని, మూడు రోజుల్లో రూ.1.20 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. , జేపీ […]

Update: 2021-05-26 23:23 GMT

దిశ సిద్దిపేట: నంగునూరు మండలం జేపీ తండా గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని గురువారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ధాన్యం కొనుగోళ్లు జరపాలని, ప్రతి ఒక్కరూ కరోనాతో జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు, హమాలీలకు సూచించారు.

జేపీ తండా గ్రామంలోని ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలో కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని, మూడు రోజుల్లో రూ.1.20 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. , జేపీ తండాలో గతేడాది 3900 క్వింటాళ్లు ధాన్యం పండగా.. ఈ యేడు అదనంగా 800 క్వింటాళ్లు ఎక్కువగా పంట ధాన్యం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు రైస్ మిల్లర్లు, హమాలీలు సహకరిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News