విస్తృతంగా సన్నరకాలు సాగయ్యేలా చూడాలి: మంత్రి హరీశ్‌రావు

దిశ, మెదక్: సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో సన్నరకాల సాగు జరిగేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని అరణ్య భవన్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయకసాగర్ ద్వారా కాలువలకు నీళ్లు చేరాయని, రోహిణి కార్తె వరకు నాట్లు పడేలా రైతులను సమన్వయ పరచాలన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో […]

Update: 2020-05-08 09:44 GMT

దిశ, మెదక్: సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో సన్నరకాల సాగు జరిగేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని అరణ్య భవన్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయకసాగర్ ద్వారా కాలువలకు నీళ్లు చేరాయని, రోహిణి కార్తె వరకు నాట్లు పడేలా రైతులను సమన్వయ పరచాలన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

Tags: Harish Rao, Telly Conference, Farming, 50 thousand acres, siddipet

Tags:    

Similar News