ఆఖరి టెస్టుకు హనుమ విహారి దూరం

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. రిషబ్ పంత్(97), పుజారా(77), రోహిత్ శర్మ(52) అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే వరుస వికెట్లు కోల్పోతున్నసమయంలో డ్రా చేయడమే లక్ష్యంగా హనుమ విహారి(23), రవిచంద్రన్ అశ్విన్(39) ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరివరకూ క్రీజులో నిలదొక్కుకుని డ్రాగా ముగించారు. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. మూడో టెస్టును డ్రాగా ముగించడంలో అసాధారణ ప్రతిభకనబర్చిన హనుమ విహారి […]

Update: 2021-01-11 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. రిషబ్ పంత్(97), పుజారా(77), రోహిత్ శర్మ(52) అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే వరుస వికెట్లు కోల్పోతున్నసమయంలో డ్రా చేయడమే లక్ష్యంగా హనుమ విహారి(23), రవిచంద్రన్ అశ్విన్(39) ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరివరకూ క్రీజులో నిలదొక్కుకుని డ్రాగా ముగించారు. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. మూడో టెస్టును డ్రాగా ముగించడంలో అసాధారణ ప్రతిభకనబర్చిన హనుమ విహారి గాయంతో ఆఖరి(నాలుగో) టెస్టుకు దూరమయ్యాడు. తొడకండరాల గాయంతోనే విహారి ఏకంగా మూడున్నర గంటలు బ్యాటింగ్‌ చేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్కానింగ్‌ కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరో మూడు రోజుల్లో నాలుగో టెస్టు మ్యాచ్‌ మొదలవనుంది. ఆ సమయానికి విహారి కోలుకునే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News