కన్‌ఫ్యూజ్ చేస్తోన్న ప్రభుత్వాలు.. దిక్కుతోచని స్థితిలో గుండాల రైతులు

దిశ, గుండాల: తెలంగాణలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ దేవుడు కూడా రైతులకు తీవ్ర అన్యాయం చేశాడు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం వర్షార్పణమై రైతులకు కంటనీరు తప్పలేదు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పీఏసీఎస్ సెంటర్ సీఈఓ నాగయ్య సన్నవడ్లు కొనబోము అనడంతో రైతులు […]

Update: 2021-11-24 08:44 GMT

దిశ, గుండాల: తెలంగాణలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ దేవుడు కూడా రైతులకు తీవ్ర అన్యాయం చేశాడు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం వర్షార్పణమై రైతులకు కంటనీరు తప్పలేదు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పీఏసీఎస్ సెంటర్ సీఈఓ నాగయ్య సన్నవడ్లు కొనబోము అనడంతో రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దాదాపు ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పదిరోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు జరగలేదు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతాంగం రాజకీయం చేయడం మానేసి, రైతుల బాధలు తీర్చాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ సందర్భాన్ని అదునుగా చేసుకున్న కొందరు దళారులు కళ్లాల వద్ద పడిగాపులు కాస్తోన్న రైతులను దోచుకుంటున్నారు. రైతుల దగ్గర నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అప్పులు చేసి పంట పండించిన రైతులు ప్రభుత్వాల నుంచి ఎదురైన పరిస్థితిని చూసి చేసేదేంలేక దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అయితే సన్న వడ్లు వద్దు అన్న విషయంపై గుండాల పీఏసీఎస్ సీఈఓ నాగయ్యను ‘దిశ’ వివరణ అడగగా.. మిల్లర్లు సన్నవడ్లు కొనుగోలు చేయబోము అన్నారని తెలిపారు. ప్రత్యా్మ్నాయం ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News