గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..!

దిశ, మహేశ్వరం: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగత అనితారెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లేమూర్ గ్రామంలో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆన్‎లైన్ క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయని విద్యార్థులను అడిగి […]

Update: 2020-09-12 08:00 GMT

దిశ, మహేశ్వరం: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగత అనితారెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లేమూర్ గ్రామంలో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆన్‎లైన్ క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‎తో అన్ని రకాల సేవలు సరళీకృతంగా జరుగుతాయని అన్నారు. రెవెన్యూ చట్టం అమలుతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Tags:    

Similar News