ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్

దిశ, ఏపీ బ్యూరో: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యం ఈ నెలాఖరితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున ఉద్యోగులు సీఎం జగన్‌ను కోరారు. బ్యాచిలర్ అకామిడేషన్ మరో ఆరు నెలలు పొడిగించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. బ్యాచిలర్ అకామిడేషన్ పొడిగించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ సచివాలయ సంఘం […]

Update: 2021-10-15 07:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యం ఈ నెలాఖరితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున ఉద్యోగులు సీఎం జగన్‌ను కోరారు. బ్యాచిలర్ అకామిడేషన్ మరో ఆరు నెలలు పొడిగించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. బ్యాచిలర్ అకామిడేషన్ పొడిగించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ సచివాలయ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు, సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు

Tags:    

Similar News