'పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

దిశ, సిద్దిపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గోల్డెన్ వాకర్ సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా శాంతి భద్రత సమయంలో పోలీసులకు సహకరిస్తామని, చట్టానికి కట్టుబడి ఉంటామని ప్రతీజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పోలీస్ అమరవీరులను స్మరించుట మనకు ఎంతో గర్వకారణమన్నారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వారు, శాంతిభద్రతల పరిరక్షణలో.. తీవ్రవాదుల అణచి వేయుటలో.. విధి […]

Update: 2021-10-21 00:11 GMT

దిశ, సిద్దిపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గోల్డెన్ వాకర్ సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా శాంతి భద్రత సమయంలో పోలీసులకు సహకరిస్తామని, చట్టానికి కట్టుబడి ఉంటామని ప్రతీజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పోలీస్ అమరవీరులను స్మరించుట మనకు ఎంతో గర్వకారణమన్నారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వారు, శాంతిభద్రతల పరిరక్షణలో.. తీవ్రవాదుల అణచి వేయుటలో.. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్లు అని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

Tags:    

Similar News