గోవాలో బీజేపీ ప్రభుత్వానికి షాక్

పనాజీ: గోవాలో బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) షాక్ ఇచ్చింది. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏ) నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వం గోవా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని, గోవా ప్రజల ప్రత్యేక జీవన విధానాలు, పర్యావరణం, వారసత్వ సంపదలపై దాడి చేసే నిర్ణయాలను తీసుకుందని ఆరోపిస్తూ ఈ నిర్ణయాన్ని తెలిపింది. జీఎఫ్‌పీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి, ఎన్‌డీఏ చైర్‌పర్సన్ అమిత్ షాకు లేఖ […]

Update: 2021-04-13 09:07 GMT

పనాజీ: గోవాలో బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) షాక్ ఇచ్చింది. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏ) నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వం గోవా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని, గోవా ప్రజల ప్రత్యేక జీవన విధానాలు, పర్యావరణం, వారసత్వ సంపదలపై దాడి చేసే నిర్ణయాలను తీసుకుందని ఆరోపిస్తూ ఈ నిర్ణయాన్ని తెలిపింది. జీఎఫ్‌పీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి, ఎన్‌డీఏ చైర్‌పర్సన్ అమిత్ షాకు లేఖ రాశారు. ఎన్‌డీఏతో బంధాన్ని గతేడాది జులైలోనే తెంచుకున్నామని, దీనిపై పునరాలోచనకూ తావులేదని అందులో పేర్కొన్నారు. తమ ప్రజాస్వామిక బాధ్యతలు, గోవా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటిస్తున్నామని వివరించారు. బీజేపీ సారథ్యంలో జరిగిన విచ్ఛిన్న రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరముందని, గోవా ప్రయోజనాలు రక్షించడంలో ఎన్‌డీఏ దారుణంగా విఫలమైందని ఆరోపించారు. మార్గావ్ మున్సిపల్ కౌన్సిల్ పోల్స్‌లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి పోటీ చేసే నిర్ణయాన్ని తీసుకున్న జీఎఫ్‌పీ తాజాగా ఎన్‌డీఏ నుంచి విడిపోతున్నట్టు వెల్లడించడం గమనార్హం.

Tags:    

Similar News