ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తాయిలాలు

దిశ, వెబ్‌డెస్క్:త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటించింది. అసోం, తమిళనాడు, కేరళ, బెంగాల్‌లో నేషనల్ హైవేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించిన కేంద్రం.. కేరళలో రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. కేరళలో 1,100 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అసోంలో రూ.19వేల కోట్లతో హైవేల అభివృద్ధి, పశ్చిమబెంగాల్‌లో రూ.25వేల కోట్లతో […]

Update: 2021-02-01 00:56 GMT

దిశ, వెబ్‌డెస్క్:త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటించింది. అసోం, తమిళనాడు, కేరళ, బెంగాల్‌లో నేషనల్ హైవేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించిన కేంద్రం.. కేరళలో రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. కేరళలో 1,100 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అసోంలో రూ.19వేల కోట్లతో హైవేల అభివృద్ధి, పశ్చిమబెంగాల్‌లో రూ.25వేల కోట్లతో హైవేల అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం రూ.18వేల కోట్లు కేటాయించారు.

8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ

Tags:    

Similar News