Big Billion Days Sale 2021: భారీ ఆఫర్లతో రానున్న ఫ్లిప్ కార్డ్..

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ కోసం బిగ్ బిలియన్ డెస్ పేరుతో సేల్‌ను ప్రకటించింది. ప్రతి ఏటా పండుగ సీజన్‌లో ఇచ్చినట్టుగానే ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఫ్యాషన్, బ్యూటీ సహా ఇతర విభాగాల్లో వివిధ ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులను చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లను ఇస్తామని, కొనుగోలు చేసిన వస్తువులపైన పేటీఎం […]

Update: 2021-09-13 07:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ కోసం బిగ్ బిలియన్ డెస్ పేరుతో సేల్‌ను ప్రకటించింది. ప్రతి ఏటా పండుగ సీజన్‌లో ఇచ్చినట్టుగానే ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఫ్యాషన్, బ్యూటీ సహా ఇతర విభాగాల్లో వివిధ ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులను చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లను ఇస్తామని, కొనుగోలు చేసిన వస్తువులపైన పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్లు, ఇతర ఎంపిక చేసిన ఉత్పత్తులపై దాదాపు 80 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది.

అలాగే, ఇంటెల్ ల్యాప్‌టాప్‌పై 40 శాతం ఇవ్వనుంది. ఇవి కాకుండా ల్యాప్‌టాప్, హెల్త్‌కేర్ పరికరాలు, హెడ్‌ఫోన్, స్పీకర్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. టీవీలపై కూడా 70 శాతం, ఫ్రిడ్జ్‌లపై 50 శాతం, ఇతర గృహోపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది. ఎప్పటి నుంచి అనే తారీఖుపై ఫ్లిప్‌కార్ట్ స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగే, ఈ సేల్ జరిగే సమయంలో ప్రతిరోజూ అర్ధరాత్రి 12, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రష్ అవర్స్ పేరుతో ఫ్లాష్‌సేల్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది.

Tags:    

Similar News