బ్రేకింగ్ : ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం.. నిలిచిపోయిన సినిమా షూటింగ్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న జనరేటర్‌ వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో పక్కనే ఉన్న జనరేటర్‌ వాహనంలో  మంటలు చెలరేగాయి. అందులో నుంచి డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. ఇక ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమయ్యింది. అయితే ప్రాణ నష్టం […]

Update: 2021-08-11 21:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న జనరేటర్‌ వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో పక్కనే ఉన్న జనరేటర్‌ వాహనంలో మంటలు చెలరేగాయి. అందులో నుంచి డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. ఇక ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమయ్యింది. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోయేసరికి అందరు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంతో షూటింగ్‌ నిలిచిపోయినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News