పింఛన్‌లో కోత ఉండదు..వదంతులు నమ్మొద్దు!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో 40 రోజుల లాక్‌డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. రాష్ట్రపతి, ప్రధాని మోదీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకూ అందరి జీతాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియాల్లో రూమర్లు కూడా ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్‌లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం ఎక్కువైంది. […]

Update: 2020-04-19 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో 40 రోజుల లాక్‌డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. రాష్ట్రపతి, ప్రధాని మోదీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకూ అందరి జీతాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియాల్లో రూమర్లు కూడా ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్‌లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం ఎక్కువైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాల్లో విపరీతంగా షేర్ అవుతున్న వందంతులను ట్విటర్ ద్వారా ఓ యూజర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఇలాంటి అవాస్తవాలు, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగులకిచ్చే పింఛన్‌లలో ఎలాంటి కోతలుండవని ప్రకటించింది. వ్యయ నియంత్రణ పేరుతో పింఛన్‌లలోనూ కోత విధించాలనే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ ట్వీట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా షేర్ చేశారు.

Tags: Pensions, Twitter, Finance Ministry, Nirmala Sitharaman, Fake News

Tags:    

Similar News