EAMCETలో ఫేస్ మ్యాపింగ్..

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఎంసెట్ (EAMCET) పరీక్ష రాసే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానానికి బదులు ఫేస్ మ్యాపింగ్ అమలు చేయనున్నట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పరీక్ష నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. అయితే, ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు ఉంటాయని.. సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు హాల్ టిక్కెట్లు […]

Update: 2020-09-03 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఎంసెట్ (EAMCET) పరీక్ష రాసే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానానికి బదులు ఫేస్ మ్యాపింగ్ అమలు చేయనున్నట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పరీక్ష నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. అయితే, ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు ఉంటాయని.. సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు Ts eamcet కన్వీనర్ సూచించారు. ఎంసెట్ పరీక్షలు పూర్తైన 15 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

Tags:    

Similar News