రేవంత్‌ను కలిస్తే తప్పేంటి : ఈటల

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల కిందట రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమేనని.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డిని రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిశానన్నారు. రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేంటన్నారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి అన్ని పార్టీల నాయకులను కలిశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో […]

Update: 2021-10-23 05:29 GMT

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల కిందట రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమేనని.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డిని రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిశానన్నారు. రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేంటన్నారు.

అప్పుడున్న పరిస్థితులను బట్టి అన్ని పార్టీల నాయకులను కలిశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ అన్ని పార్టీల మద్దతు కూడగట్టలేదా, అప్పుడు జాతీయ పార్టీల నేతలను కలవలేదా అని అడిగారు. కేసీఆర్ సీఎం అయ్యాకే ఇతర పార్టీల నాయకులను కలవకూడదనే కుసంస్కారం తయారైందని విమర్శించారు. రాష్ర్ట అభివృద్ధి కోసం చాలా మందిని కలవడం సహజమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కలువలేదని.. టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కలిశానని, తాను పార్టీ మారేందుకు ఎంతమేర కలవలేదని ఈటల కుండబద్దలు కొట్టారు.

Tags:    

Similar News