పింఛన్ డబ్బులు ఇచ్చింది

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ […]

Update: 2020-08-10 06:24 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ డబ్బులు దాచుకుంది. అదే గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకుంది. తన వద్ద ఉన్న రూ.10,000 లను ఆయనకు అందజేసి, అండగా నిలబడింది.

Tags:    

Similar News