తెలంగాణ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ వైద్య కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ ..Latest Telugu News
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ వైద్య కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సులకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నీట్ యూజీ - 2020లో అర్హత సాధించిన వారు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆయుష్ కోర్సులు:
బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్
అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణత, నీట్ యూజీ - 2022 స్కోరు ఉండాలి.
వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్: నవంబర్ 13, 2022 నుంచి నవంబర్ 20, 2022 వరకు.
వెబ్సైట్: https://www.knruhs.telangana.gov.ఇన్
ఇవి కూడా చదవండి : స్పీకర్ వ్యవస్థ: ఇండియన్ పాలిటీ