సిద్దిపేటకు చెందిన గిరిజన బిడ్డకి అరుదైన గౌరవం..

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటకు చెందిన గిరిజన బిడ్డకు డాక్టరేట్ వరించింది. సిద్దిపేట పట్టణం గణేష్ నగర్‌కి చెందిన కెమ్మసారం బాలరాజు, ప్రొఫెసర్ పార్వతి పర్యవేక్షణలో గిరిజనుల ఉనికి, సంస్కృతిపైన మహాశ్వేతాదేవి, జీఎన్ దేవి రచనలపై పరిశోధన చేశారు. ఇందుకు గాను ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రు టెక్నాలాజికల్ యూనివర్సిటీ.. ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ప్రస్తుతం ఆయన జేఎన్‌టీ‌యూ హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. కాగా, గిరిజన బిడ్డకి […]

Update: 2021-08-13 05:01 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటకు చెందిన గిరిజన బిడ్డకు డాక్టరేట్ వరించింది. సిద్దిపేట పట్టణం గణేష్ నగర్‌కి చెందిన కెమ్మసారం బాలరాజు, ప్రొఫెసర్ పార్వతి పర్యవేక్షణలో గిరిజనుల ఉనికి, సంస్కృతిపైన మహాశ్వేతాదేవి, జీఎన్ దేవి రచనలపై పరిశోధన చేశారు. ఇందుకు గాను ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రు టెక్నాలాజికల్ యూనివర్సిటీ.. ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

ప్రస్తుతం ఆయన జేఎన్‌టీ‌యూ హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. కాగా, గిరిజన బిడ్డకి అవార్డు రావడం పట్ల జిల్లా ఎరుకల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన స్థితిగతులపైన ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని, వారి అభ్యుదయం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంబన అవసరమని తెలిపారు.

Tags:    

Similar News