ఎట్టి పరిస్థితిలో అలాంటి వారిని ఉపేక్షించవద్దు.. సీఎం జగన్

దిశ, ఏపీ బ్యూరో: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారం చేస్తున్నారని.. దానిపట్ల అధికారులు కఠినంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకం పట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలని.. ప్రచారం చేసేవారిని ఉపేక్షించవద్దని సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు […]

Update: 2021-12-01 07:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారం చేస్తున్నారని.. దానిపట్ల అధికారులు కఠినంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకం పట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలని.. ప్రచారం చేసేవారిని ఉపేక్షించవద్దని సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలని సూచించారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను కూడా ప్రజలకు చూపించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News