సోమవారం శివున్ని ఏ పూలతో పూజిస్తే మంచి జరుగుతుందో తెలుసా?

సోమవారం ఆ పరమ శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అంటారు. అందువలన సోమవారం రోజున శివ భక్తులందరూ ఉదయాన్నే నిద్రలేచి, భక్తి శ్రద్ధలతో ఆ భోళా శంకరుడిని పూజిస్తుంటారు.

Update: 2023-03-20 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోమవారం ఆ పరమ శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అంటారు. అందువలన సోమవారం రోజున శివ భక్తులందరూ ఉదయాన్నే నిద్రలేచి, భక్తి శ్రద్ధలతో ఆ భోళా శంకరుడిని పూజిస్తుంటారు. అయితే ఆ శివయ్య ఆశీస్సులు అంత త్వరగా లభించవని చెబుతుంటారు పెద్దలు, ఎంతో ఘోర తపస్సు చేస్తేగాని ఆ భగవంతుడు అనుగ్రహించడంట. కానీ శివున్ని ఇష్టంగా పూజిస్తే మాత్ర తప్పక కరుణిస్తాడంట.

అయితే సోమవారం రోజు కొన్ని పూలతో ఆ పరమశివున్ని పూజిస్తే బాధలన్నీ పోతాయంట. అవి ఏ పూలో చూద్దాం. పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన బిళ్వ వృక్షం ఆకులు, పువ్వులను ఉపయోగించి పూజ చేయడం వల్ల తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది.

బిల్వ మొక్క పూలు, ఆకులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. వీటి పువ్వులతో పూజ చేయడం వల్ల తప్పకుండా ఆ శివయ్య ఆశీస్సులు పొందడమే కాకుండా సకల బాధలన్నీ తీరిపోయి కోరుకున్నది నెరవేరుతుందంట.

Also Read..

ఉగాది రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలో తెలుసా? 

Tags:    

Similar News