16శాతం ఎగబాకిన దేవిల్యాబ్స్ షేర్లు

ముంబయి: దేశీయ మార్కెట్‌లో దేవి ల్యాబ్స్ (Devi labs) సూచీలు సోమవారం గణనీయంగా లబ్ధి పొందాయి. రికార్డు స్థాయిలో 16శాతం ఎగబాకి రూ.3,228.05కు చేరుకుంది. ఇది 52 వారాల గరిష్ఠం కావడం గమనార్హం. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంతో వార్షిక లాభం (Annual profit) (పన్నులు చెల్లించిన తర్వాత) ఏకంగా 80శాతం పెరిగి రూ.492.1కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (Financial year)లో ఇది రూ.272.74కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం(Income) 49శాతం పెరిగి […]

Update: 2020-08-10 11:19 GMT

ముంబయి: దేశీయ మార్కెట్‌లో దేవి ల్యాబ్స్ (Devi labs) సూచీలు సోమవారం గణనీయంగా లబ్ధి పొందాయి. రికార్డు స్థాయిలో 16శాతం ఎగబాకి రూ.3,228.05కు చేరుకుంది. ఇది 52 వారాల గరిష్ఠం కావడం గమనార్హం.

జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంతో వార్షిక లాభం (Annual profit) (పన్నులు చెల్లించిన తర్వాత) ఏకంగా 80శాతం పెరిగి రూ.492.1కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (Financial year)లో ఇది రూ.272.74కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం(Income) 49శాతం పెరిగి రూ.1,730.47 కోట్లకు చేరుకున్నది.

జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో విదేశాల ద్వారా రూ.5కోట్ల లాభం గడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.6 కోట్ల నష్టంగా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News