కలెక్టరేట్ వద్ద దళిత మహిళ నిరసన

దిశ, సంగారెడ్డి: సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వార్డుమెంబరైన తన పట్ల స్థానిక సర్పంచ్ మునిగె నవీన్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించి.. కులం పేరుతో దూషించాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం బాధిత మహిళ నీరడి విజయలక్ష్మీ నిరసన చేపట్టింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లగూడెం గ్రామస్తులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా నిందితుడిని […]

Update: 2020-07-03 03:15 GMT

దిశ, సంగారెడ్డి: సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వార్డుమెంబరైన తన పట్ల స్థానిక సర్పంచ్ మునిగె నవీన్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించి.. కులం పేరుతో దూషించాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం బాధిత మహిళ నీరడి విజయలక్ష్మీ నిరసన చేపట్టింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లగూడెం గ్రామస్తులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అసభ్యంగా ప్రవర్తించి, కులం పేరుతో దూషించిన సర్పంచ్ నవీన్ కుమార్, భౌతిక దాడికి పాల్పడిన ఆయన భార్య, తల్లిని అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలన్నారు. విజయలక్ష్మీకి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం హెచ్చరించారు.

Tags:    

Similar News