అంత్యక్రియలకు ఆటంకం

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కరోనా సమయంలో కొందరి వ్యవహార తీరు బాధాకరంగా ఉంది. అసలు వారిలో మానవీయ కోణమే లేకుండా పోతోంది. సహజ మనిషిలా ఆలోచించాల్సింది పోయి మరోలా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపడంలేదు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ లో కరోనా ఒకరు మృతిచెందారు. రాజీవ్ గృహకల్ప వద్ద అతడి అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. స్మశాన వాటికలో ఖననం చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో […]

Update: 2020-08-02 01:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కరోనా సమయంలో కొందరి వ్యవహార తీరు బాధాకరంగా ఉంది. అసలు వారిలో మానవీయ కోణమే లేకుండా పోతోంది. సహజ మనిషిలా ఆలోచించాల్సింది పోయి మరోలా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపడంలేదు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ లో కరోనా ఒకరు మృతిచెందారు. రాజీవ్ గృహకల్ప వద్ద అతడి అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. స్మశాన వాటికలో ఖననం చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అంత్యక్రియలు జరిగేలా సహకిరించారు.

Tags:    

Similar News