ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వస్తోందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996కి చేరింది. అదే సమయంలో కరోనాతో 16మంది మరణించగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి […]

Update: 2021-08-04 09:48 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వస్తోందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996కి చేరింది.

అదే సమయంలో కరోనాతో 16మంది మరణించగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,444కి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,412 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 19,40,368కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News