విజయవాడ దుర్గమ్మ గుడిలో కరోనా విజృంభణ

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనక దర్గమ్మ ఆలయంలో కరోనా విజృంభిస్తోంది. ఆలయ ఈవో పాటు పూజారికి పాజిటివ కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయంలోని వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆయన కన్నుమూశారు. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో కరోనాతో చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, దేవస్థానం ఈవో […]

Update: 2020-08-07 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనక దర్గమ్మ ఆలయంలో కరోనా విజృంభిస్తోంది. ఆలయ ఈవో పాటు పూజారికి పాజిటివ కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయంలోని వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆయన కన్నుమూశారు. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో కరోనాతో చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, దేవస్థానం ఈవో కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, ఈవో సహా ఇప్పటి వరకు దుర్గగుడిలో 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News