గోవాలో కాంగ్రెస్ నేతల క్యాంప్.. దుద్దిల్ల శ్రీధర్ బాబు వ్యూహం ఏంటి..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ క్యాంప్ హుటాహుటిన మార్చేశారు. మంథని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నాలుగు రోజుల క్రితం క్యాంప్ పెట్టిన సంగతి తెలిసిందే. శామీర్ పేట్‎లోని లియోనియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపును కొద్దిసేపటి క్రితం గోవా, బెంగుళూరులకు తరలించారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నాయకత్వం 40 మంది ప్రజా ప్రతినిధులను తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‎కే తీసుకెళ్లడమే విచిత్రంగా మారిందంటే.. వీరిని ఇతర రాష్ట్రాలకు తరలించడంపై మరింత చర్చ […]

Update: 2021-12-02 11:24 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ క్యాంప్ హుటాహుటిన మార్చేశారు. మంథని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నాలుగు రోజుల క్రితం క్యాంప్ పెట్టిన సంగతి తెలిసిందే. శామీర్ పేట్‎లోని లియోనియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపును కొద్దిసేపటి క్రితం గోవా, బెంగుళూరులకు తరలించారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నాయకత్వం 40 మంది ప్రజా ప్రతినిధులను తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‎కే తీసుకెళ్లడమే విచిత్రంగా మారిందంటే.. వీరిని ఇతర రాష్ట్రాలకు తరలించడంపై మరింత చర్చ సాగుతోంది.

శ్రీధర్ బాబు వ్యూహం ఏంటో..?

గెలవమని తెలిసినా శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గానికి చెందిన వారిని క్యాంపులకు తరలించడం వెనక వ్యూహం ఏంటన్నదే అటు టీఆర్‌ఎస్ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిని కేర్ చేసేందుకు ఆయన ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారన్నదే పజిల్‌గా మారింది. చివరి క్షణం వరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో టెన్షన్ రేకెత్తిస్తున్న ఆయన ఎత్తుగడ వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఝలక్ ఇస్తారా లేక అనుకూలంగా నిర్ణయం తీసకుంటారా అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags:    

Similar News