ఎర్రబెల్లి రవీందర్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందపూర్ గ్రామ శివారులోని ఈఆర్ఆర్ క్రషర్ యజమాని ఎర్రబెల్లి రవీందర్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, క్రషర్ గుర్తింపు రద్దు చేయాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నిర్వహిస్తూ కార్మికుల మరణాలకు కారణమవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈఆర్ఆర్ క్రషర్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేగాకుండా.. కార్మికులకు భద్రత […]

Update: 2021-10-25 04:11 GMT

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందపూర్ గ్రామ శివారులోని ఈఆర్ఆర్ క్రషర్ యజమాని ఎర్రబెల్లి రవీందర్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, క్రషర్ గుర్తింపు రద్దు చేయాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నిర్వహిస్తూ కార్మికుల మరణాలకు కారణమవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈఆర్ఆర్ క్రషర్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేగాకుండా.. కార్మికులకు భద్రత కరువైందని వారికి ఎలాంటి సేఫ్టీ పరికరాలు అందించకపోవడం వల్లే ప్రమాదంలో మరణించారని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కార్మికుల ప్రాణాలను తేలికగా తీసుకుంటున్న రవీందర్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, జిల్లా అధ్యక్షుడు మంద సురేష్ వినతిపత్రంలో కోరారు.

Tags:    

Similar News