అందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తాం

దిశ, మేడ్చల్: జిల్లాలోని 636 చౌక దుకాణాల ద్వారా 4 లక్షల 90 వేల రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్, రెవెన్యూ, అంగన్వాడి, పోలీసు, డీలర్ల సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2 లక్షల పైచిలుకు కార్డులకు బియ్యం పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ పూర్తిచేయడం […]

Update: 2020-04-06 06:06 GMT

దిశ, మేడ్చల్: జిల్లాలోని 636 చౌక దుకాణాల ద్వారా 4 లక్షల 90 వేల రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్, రెవెన్యూ, అంగన్వాడి, పోలీసు, డీలర్ల సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2 లక్షల పైచిలుకు కార్డులకు బియ్యం పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ పూర్తిచేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు, అపోహలకు గురి కాకుండా ఒక క్రమ పద్ధతిలో రేషన్ దుకాణాలకు రావాలని కోరారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం అందరి కర్తవ్యమన్నారు. ఎట్టి పరిస్థితులలో మాస్కులు ధరించి కనీసం మీటరు దూరంలో ఉండి సరుకులు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయలు రాష్ట్ర స్థాయిలో కార్డు దారులకు బ్యాంక్ అకౌంట్‎లో జమ చేయబడతాయని స్పష్టం చేశారు.

tag: collector Venkateshwarlu, distribute, ration rice, medchal

Tags:    

Similar News