నాలాలపై మూతలు వేయాలి : కలెక్టర్

దిశ, మెదక్: మెదక్​ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిఒక్కరూ పాటుపడాలని మెదక్​ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం ఏరియాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్​ ఛైర్మన్​ చంద్రపాల్‌తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. డివైడర్లను, రోడ్డు పక్కన ఉన్న నాలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ… మెదక్​ పట్టణాన్ని నందనవనంగా తీర్చదిద్దేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలని […]

Update: 2020-09-24 10:37 GMT

దిశ, మెదక్: మెదక్​ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిఒక్కరూ పాటుపడాలని మెదక్​ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం ఏరియాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్​ ఛైర్మన్​ చంద్రపాల్‌తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. డివైడర్లను, రోడ్డు పక్కన ఉన్న నాలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ…

మెదక్​ పట్టణాన్ని నందనవనంగా తీర్చదిద్దేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలని తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్​ సిబ్బందికి అందించాలన్నారు. డివైడర్లలో అవసరమైన మొక్కలు నాటాలని, అలాగే రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను నాటాలని సూచించారు. మురికి కాలువలు తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాటిని మూసివేయాలని ఆర్‌అండ్​‌బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News