భూమి కబ్జా జరిగింది వాస్తవమే : మెదక్ కలెక్టర్

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ప్రాథమిక విచారణతో తేలిందని మెదక్ కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. శనివారం అచ్చంపేటలో పర్యటించిన కలెక్టర్ ఈ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. భూముల కబ్జా విషయంలో పూర్తి నివేదిక మరో నాలుగు గంటల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. అచ్చంపేటలో భూములు కబ్జా జరిగిన విషయం వాస్తవమే అని, బాధిత రైతులతో మాట్లాడి, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి […]

Update: 2021-05-01 01:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ప్రాథమిక విచారణతో తేలిందని మెదక్ కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. శనివారం అచ్చంపేటలో పర్యటించిన కలెక్టర్ ఈ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. భూముల కబ్జా విషయంలో పూర్తి నివేదిక మరో నాలుగు గంటల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. అచ్చంపేటలో భూములు కబ్జా జరిగిన విషయం వాస్తవమే అని, బాధిత రైతులతో మాట్లాడి, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. తమ భూములు లాగేసుకున్నారని బాధిత రైతులు తమ వాపోతున్నారని వెల్లడించారు.

Tags:    

Similar News