ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎఫైర్? బయటపడ్డ అసలు నిజాలు

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పలువురు పెళ్లిళ్లు చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-29 03:45 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పలువురు పెళ్లిళ్లు చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం 44 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోయిన్లతో లవ్‌లో ఉన్నాడంటూ పుకార్లు ఊపందుకున్నాయి.

వాటిపై డార్లింగ్ స్పందించకపోవడంతో ఇప్పటికీ పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ప్రభాస్ ముగ్గురు స్టార్ హీరోయిన్లతో ప్రభాస్ లవ్ ఎఫైర్ పెట్టుకున్నట్లు ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో వర్షం, పౌర్ణమి సినిమాల్లో నటించే సమయంలో ప్రభాస్, త్రిష ప్రేమించుకున్న ట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై వీరిద్దరు స్పందించకపోవడంతో రూమర్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరి పెళ్లి ఫొటోలు మార్ఫింగ్ చేసి కూడా వైరల్ చేశారు. కానీ దీనిపై అనుష్క స్పందించ మంచి ఫ్రెండ్స్ అని చెప్పడంతో వాటికి చెక్ పడినట్లు అయింది. ఇక చివరిగా.. ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కలిసి ఇటీవల ఆదిపురుష్‌లో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు టాక్ నడిచింది. దీన్ని కృతి ఖండించడంతో వార్తలు ఆగిపోయాయి. అయితే నిజానికి ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌తో అయినా నటిస్తే చాలు పెళ్లి పుకార్లు రావడం కామన్. అదే ప్రభాస్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి షూటింగ్‌‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Similar News