షూటింగ్ టైంలో కడుపు తెచ్చుకున్న తోటి నటీమణులు.. హీరోయిన్ సంచలన కామెంట్స్

బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా రిలేషన్ షిప్ స్టేటస్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఎంగేజ్మెంట్ చేసుకుని రింగ్ ఎక్స్ చేంజ్ ఫొటోలను పోస్ట్ చేసింది. కానీ పెళ్లి

Update: 2024-05-13 07:59 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా రిలేషన్ షిప్ స్టేటస్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఎంగేజ్మెంట్ చేసుకుని రింగ్ ఎక్స్ చేంజ్ ఫొటోలను పోస్ట్ చేసింది. కానీ పెళ్లి ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ' హీరామండి ' సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యూటీ.. తాజాగా కో యాక్టర్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి మాటలు ఇంత సింపుల్ గా మాట్లాడేస్తున్నారు ఏంటని చర్చించుకుంటున్నారు జనాలు.

కాగా ఓ కామెడీ షోకి హాజరైన సోనాక్షిని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించగా.. నిజంగా చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. తన తోటి నటీమణులు రిచా చద్ధా, షర్మిల షూటింగ్ జరుగుతున్నప్పుడే పెళ్లి చేసుకుని, ఇప్పుడు కడుపుతో కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. వీళ్ళ కంటే ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్న తను మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నట్లు తెలిపింది. కాగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ ప్రతి సీన్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవల్ లో అప్లాజ్ అందుకోవడం విశేషం.

Similar News