చీర కట్టుకున్నందుకే ఆ క్రికెటర్లు అవమానించారు.. స్టార్ నటి

దిశ, సినిమా: ప్రముఖ నటి మందిరా బేడీ తన జీవిత ప్రయాణంలో ఎన్నో హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నాయంటోంది.

Update: 2022-03-05 11:17 GMT

దిశ, సినిమా: ప్రముఖ నటి మందిరా బేడీ తన జీవిత ప్రయాణంలో ఎన్నో హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నాయంటోంది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మందిరా.. కొన్ని క్రికెట్ టోర్నమెంట్‌లలో ప్రీ-మ్యాచ్ షోలను హోస్ట్ చేసినప్పుడు ప్రముఖ క్రికెటర్లు తనను చిన్నచూపు చూశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ప్లేయర్లను ప్రశ్నలడుగుతున్నపుడు 'ఆమె ఏమి అడుగుతోంది' అన్నట్లుగా తన వైపు చూసేవాళ్లని తెలిపింది. 'నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నపుడు నాతో ఇంటర్య్వూలు చేసేందుకు ఎవరూ అంగీకరించలేదు. మాజీ క్రికెటర్లందరితో స్నేహంగానే ఉన్నాను. కానీ, చాలామందికి నేను చీర కట్టుకుని మాట్లాడటం నచ్చలేదు. ఎన్నోసార్లు నన్ను హేళన చేసేందుకు ప్రయత్నించారు. ఫ్యాషన్ దుస్తులు ధరించేవాళ్లే అందంగా ఉన్నరన్నట్లు వ్యవహరించేవాళ్లు' అని వివరించింది. ఈ క్రమంలోనే తాను హోస్ట్‌గా వ్యవహరించే సోనీ ఛానెల్ యాజమాన్యం అండగా నిలిచిందన్న మందిరా.. 2003 - 2007 ICC క్రికెట్ ప్రపంచకప్‌తో పాటు 2004 - 2006లో ఛాంపియన్స్ ట్రోఫీలు, IPL రెండవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CWM8LbdIlai/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News