రాష్ట్రపతి భవన్ నుంచి చంద్రబాబుకు పిలుపు.. ఏపీలో రాష్ట్రపతి పాలన?

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈనెల 25,26న రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మరో18 మంది నేతలు హస్తిన పర్యటనలో ఉండనున్నారు. చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి భవన్ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు అపాయింట్మెంట్ ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా కేవలం ఐదుగురికి మాత్రమే […]

Update: 2021-10-23 03:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈనెల 25,26న రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మరో18 మంది నేతలు హస్తిన పర్యటనలో ఉండనున్నారు. చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి భవన్ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు అపాయింట్మెంట్ ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతినిచ్చారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు శనివారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భవన్, టీడీపీ కార్యాలయాలు…టీడీపీ నేతల ఇళ్లపై దాడులు, అక్రమ కేసులపై రాష్ట్రపతికి చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356 అమలు చేయాలని రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కోరనుంది. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా ఏందీ అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

Tags:    

Similar News