ఇది ప్రభుత్వం చేసిన హత్యే: చంద్రబాబు

దిశ ఏపీ బ్యూరో: టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మరణించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు స్పందించిన బాబు.. నలంద కిశోర్ ప్రభుత్వ వేధింపుల కారణంగానే గుండెపోటుకు గురయ్యారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌పై పోస్టులు షేర్ చేశాడని ఆరోపిస్తూ, 65 ఏళ్ల వృద్ధుడని కూడా చూడకుండా అరెస్టు చేసి వైజాగ్ నుంచి కర్నూలు రోడ్డు […]

Update: 2020-07-25 08:00 GMT

దిశ ఏపీ బ్యూరో: టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మరణించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు స్పందించిన బాబు.. నలంద కిశోర్ ప్రభుత్వ వేధింపుల కారణంగానే గుండెపోటుకు గురయ్యారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌పై పోస్టులు షేర్ చేశాడని ఆరోపిస్తూ, 65 ఏళ్ల వృద్ధుడని కూడా చూడకుండా అరెస్టు చేసి వైజాగ్ నుంచి కర్నూలు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారని అన్నారు.

అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా? అంటూ నిలదీశారు. దీంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వేదనతో గుండెపోటుకి గురయ్యారని తెలిపారు. కిశోర్‌ది కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యేనని స్పష్టం చేశారు, నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News