నేడు టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి విడుదల చేయనుంది.

Update: 2024-04-30 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో ఈ మేనిఫెస్టోను తయారు చేశారు. బాదుడు లేని సంక్షేమం.. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకు ఇవ్వనుంది. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాదని ప్రజలకు కూటమి నేతలు వివరించనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే డెవలప్‌మెంట్‌పై స్పష్టమైన రూట్ మ్యాప్‌తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు సమాచారం. చంద్రబాబు నివాసంలో జరిగే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News