విద్యార్థులకు గుడ్న్యూస్: LIC HFL నుంచి రూ.15,000 స్కాలర్షిప్
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాలర్షిప్ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..Latest Telugu News
దిశ, ఎడ్యుకేషన్: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాలర్షిప్ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థులు అర్హులు.
12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండి ఉండాలి.
కరోనా సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్ల పాటు అందిస్తారు.
కావలసిన పత్రాలు:
ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్
విద్యార్హత మార్క్స్ షీట్
ఆదాయ ధృవీకరణ పత్రం
ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్
ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్.
బ్యాంక్ అకౌంట్ వివరాలు
క్యాస్ట్ సర్టిఫికెట్ తదితర పత్రాలు ఉండాలి.
చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2022.
వెబ్సైట్: https://www.buddy4study.కం