ఆంధ్రప్రదేశ్ TTDలో ఉద్యోగాలు.. నెలకు రూ.50వేల వరకు వేతనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోJobs in Andhra Pradesh TTD.

Update: 2022-04-08 05:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్.. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఇందులో ఫార్మ్ నేజర్‌/గోశాల మేనేజర్‌–03, కాంపౌండర్‌/డెయిరీ అసిస్టెంట్‌–06 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

*గోశాల మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేన్ డిగ్రీ పాసై ఉండాలి. 

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,060 వేతనం చెల్లిస్తారు.

*డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి పోస్టును అనుసరించి పదో తరగతి, రెండేళ్ల యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,980 వేతనం చెల్లిస్తారు. 

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Director, Sri Venkateswara Cow Protection Trust, TTD, Chandragiri Road, Tirupati – 517502, Andhra Pradesh చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.tirumala.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు. 

Tags:    

Similar News