నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఎలాంటి రాత పరీక్ష లేకుండా 2446 ప్రభుత్వ ఉద్యోగాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది..Latest Telugu News

Update: 2022-08-16 15:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2446 పైగా పోస్ట్‌లకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంతకుముందు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్ఓడీ కార్యాలయాలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసేవి. కానీ ఇప్పుడు ఉమ్మడి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా అభ్యర్థులు ఒకే నోటిఫికేషన్‌తో 3 విభాగాల్లో పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.

అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అప్లై చేసిన దరఖాస్తులను వచ్చే ఏడాది పాటు పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రస్తుత ఏడాదిలో ఏదైనా పోస్టు ఖాళీ అయితే దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇప్పటికే ఉన్న దరఖాస్తుల నుంచి ఎంపిక చేస్తారు. ఒకే అర్హతతో 42 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పారా మెడికల్ పోస్టుల్లో అవసరమైన వాటిని ఒకే అర్హతతో నియమిస్తున్నారు.

అర్హత: పోస్ట్‌లను అనుసరించి 10/ఇంటర్మీడియట్/ITI/డిప్లొమా/డిగ్రీ/ఇంజనీరింగ్/PG/B ఫార్మసీ/D ఫార్మసీ కలిగి ఉండాలి.

వయస్సు: 42 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 250

SC/ST/OBC/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

శ్రీకాకుళం

https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2022/08/2022080649.pdf

విజయనగరం

https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2022/08/2022080684.pdf

కృష్ణా

https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2022/08/2022080692.pdf

గుంటూరు

https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2022/08/2022080824.pdf

తూర్పుగోదావరి

https://cdn.s3waas.gov.in/s36f3ef77ac0e3619e98159e9b6febf557/uploads/2022/08/2022080880.pdf

పశ్చిమగోదావరి

https://cdn.s3waas.gov.in/s381448138f5f163ccdba4acc69819f280/uploads/2022/08/2022080810.pdf

ప్రకాశం

https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2022/08/2022080832.pdf

కర్నూలు

https://cdn.s3waas.gov.in/s37f24d240521d99071c93af3917215ef7/uploads/2022/08/2022080943.pdf

అనంతపురం, విశాఖపట్నం, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఖాళీల కోసం ఆయా జిల్లాల అధికారిక వెబ్‌సైట్‌‌లను చూడగలరు.

Tags:    

Similar News