ఓటర్ల ప్రసన్నం షురూ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 75 మన్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరగనుంది. అనతరం 14న కౌంటింగ్ చేపడతారు. మొత్తం 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులుంటే 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రచారంలో అధికార పక్షం, ప్రతిపక్షాల […]

Update: 2021-03-08 21:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 75 మన్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరగనుంది. అనతరం 14న కౌంటింగ్ చేపడతారు. మొత్తం 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులుంటే 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రచారంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు హద్దులు దాటాయి. నువ్వా , నేనా అన్నంత రేంజ్లో ఈ ఎన్నికల ప్రచారం సాగింది. ఆఖరి రోజు కూడా అన్ని పార్టీలు తొందరగానే ఎన్నికల ప్రచారాన్ని ముగించాయి. ఇక పోలీంగ్ పై దృష్టి సాధించి, ఓటర్లను ఆకర్షించడానికి రేడీ అవుతున్నారు.

పోలీంగ్కు ఒక్కరోజే మిగిలి ఉండడతో అభ్యర్ధలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మందుబాబులను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే భారీగా షాపుల నుంచి మద్యం తెచ్చి పెట్టుకున్నట్టు సమాచార. అభ్యర్థులు నగదు, ఇతరత్రా పంచే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీ పై ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News