‘ప్రజాసేవలో నిమగ్నమయ్యారు’

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 365 నిరంతరం పరి చేసే శాఖ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు పరిమితం అయితే.. తమ శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నమయ్యారన్నారు. కరోనా ప్రభావం వలన వైద్య శాఖను మరింత […]

Update: 2020-10-08 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 365 నిరంతరం పరి చేసే శాఖ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు పరిమితం అయితే.. తమ శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నమయ్యారన్నారు.

కరోనా ప్రభావం వలన వైద్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా నెలకొందన్నారు. ఆ దిశగానే సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఆదేశించారన్నారు. ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వైధ్యాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News