ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్!

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వివిధ కాలపరిమితులపై ఎఫ్‌డీ రేట్లను సవరించింది

Update: 2023-06-02 13:46 GMT

బెంగళూరు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వివిధ కాలపరిమితులపై ఎఫ్‌డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లను జూన్ 1 నుంచి అమల్లోకి తెచ్చినట్టు బ్యాంకు తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ వినియోగదారులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 8.25 శాతం మధ్య వడ్డీని ఇస్తోంది.

గరిష్ఠంగా 12 నెలలతో పాటు 80 వారాల కాలవ్యవధులపై 8.45 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. మిగిలిన కాలవ్యవధుల్లో 12 నెలల 1 రోజు నుంచి 13 నెలలకు 6.70 శాతం, 13 నెలల 1 రోజు నుంచి 559 రోజులకు 8.20 శాతం, 561 రోజుల నుంచి 989 రోజులకు 7.70 శాతం, 990 రోజులకు 7.95 శాతం, 991 రోజుల నుంచి 60 నెలల కాలానికి 7.40 శాతం వడ్డీ లభిస్తుంది.

ప్లాటినా ఎఫ్‌డీ పథకంపై అదనంగా 0.20 శాతం ఎక్కువ వడ్డీని లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

Also Read..

రూ. 8,900 కే Flipkartలో Apple iPad.. ఓన్లీ లిమిటెడ్ ఆఫర్

Tags:    

Similar News