ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచనున్న టయోటా కిర్లోస్కర్

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Update: 2024-03-28 09:20 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1,2024 నుంచి కొన్ని ఎంపిక చేసిన కార్ల వేరియంట్లను బట్టి ధరలను 1శాతం వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు గురువారం పేర్కొంది. కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ఇతర వ్యయాలు భారంగా మారడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తెలిపింది. ధరల పెంపు ప్రధానంగా టొయోటా ఫార్చ్యూనర్ , హిలక్స్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా , అర్బన్ క్రూయిజర్ హైరైడర్, గ్లాంజాలపై ప్రభావం చూపే అవకాశంఉంది. TKM హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా నుండి ప్రీమియం SUV ఫార్చ్యూనర్ వరకు రూ. 6.86 లక్షల నుండి రూ. 51.44 లక్షల మధ్య ధర కలిగిన అనేక రకాల వాహనాలను విక్రయిస్తోంది. ఇప్పటికే చాలా ఆటోమేకర్ కంపెనీలు తమ మూలధన ఖర్చులు, ముడిసరుకుల వ్యయాలు పెరగడంతో మోడల్‌ను బట్టి కార్ల ధరలను పెంచగా, ఇప్పుడు TKM కూడా ధరలు పెంచడం గమనార్హం.

Similar News