Tata Motors launches new Tigor. ev with range of 315 km.

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా తన టిగోర్ మోడల్‌లో సరికొత్త అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

Update: 2022-11-23 12:22 GMT

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా తన టిగోర్ మోడల్‌లో సరికొత్త అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలతో, కొత్త టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ. 12.49 లక్షలుగా నిర్ణయించామని, ఇందులో ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్లు అందిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రీమియం కార్లలో లభించే సరికొత్త టెక్నాలజీని ఈ కారులో అమర్చామని, 55 కిలోవాట్ బ్యాటరీ ద్వారా ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత 315 కిలోమీటర్లు ప్రయాణం చేసేందుకు వీలుంటుందని కంపెనీ వివరించింది. అంతేకాకుండా రిమోట్ లాక్, అన్‌లాక్, జెడ్ కనెక్ట్ టెక్నాలజీ, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, ఆటో హెడ్‌ల్యాంప్ వంటి కొత్త ఫీచర్లను అందించామని పేర్కొంది.

టిగోర్ ఈవీలో ఉంటుంది. దేశీయ మార్కెట్లో తొలిసారి టాటా టిగోర్ ఈవీని అక్టోబర్‌లో తీసుకొచ్చామని, ఊహించని స్థాయిలో నెలరోజుల్లోనే 20 వేల బుకింగ్స్ రావడం సంతోషంగా ఉందని కంపెనీ ప్యాసింజర్ ఈవీ ఎండీ శైలేష్ చంద్ర అన్నారు.

Also Read : మార్కెట్లోకి విడుదలైన సరికొత్త Bajaj Pulsar P150

Tags:    

Similar News