స్మార్ట్ స్లీప్ కంట్రోల్ ఫీచర్‌తో OnePlus 4K UHD స్మార్ట్ టీవీ

స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ టీవీలను విడుదల చేస్తూ భారత మార్కెట్లో దూసుకుపోతున్న OnePlus కంపెనీ కొత్తగా మరో మోడల్ స్మార్ట్ టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు ‘OnePlus TV 55 Y1S Pro’.

Update: 2022-12-09 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ టీవీలను విడుదల చేస్తూ భారత మార్కెట్లో దూసుకుపోతున్న OnePlus కంపెనీ కొత్తగా మరో మోడల్ స్మార్ట్ టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు 'OnePlus TV 55 Y1S Pro'. దీనిలో 138 సెం.మీ 4K UHD డిస్‌ప్లేను అమర్చారు. ఇది వన్‌ప్లస్ సిగ్నేచర్ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్‌‌తో పాటు స్మార్ట్ వాచ్‌ను కూడా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. OnePlus Connect 2.0 ద్వారా స్మార్ట్ ఫోన్ టీవీ రిమోట్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే ఒకే టైంలో ఐదు డివైజ్‌లను టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది Android TV 10 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.


దీనిలో ప్రత్యేకంగా 'స్మార్ట్ స్లీప్ కంట్రోల్ ఫీచర్' ను అందించారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్ నిద్ర పోయినప్పుడు స్మార్ట్ వాచ్ గ్రహించి, ఆటోమెటిక్‌గా టీవీని స్విచ్ ఆఫ్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కోసం Dolby Audio 24W అవుట్‌పుట్‌ను అందించారు. Google Assistant, Alexa వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది. స్మార్ట్ టీవీ ఆక్సిజన్‌ప్లే 2.0తో ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను అందిస్తుంది. ఇంకా, Prime Video, Netflix, Hotstar, Google Play Store మొదలగు కంటెంట్‌లను కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 39,999. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ OnePlus.in, Amazon.in, Flipkartల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.




Similar News